Posts

Showing posts from 2013
పాట సాహిత్యం: చందమామను చూచి వద్దామా సదానందా (2) తల్లడించే తామసులను వెళ్ళవేసి వేవేగ ఒళ్ళుమరచి తారకమున తెల్లవారేదనక మనము || చందమామను చూచి వద్దామా సదానందా || పంచబాణుని పారద్రోలి కుంజరమ్ముల కూలవేసి మంటి మింటి రెంటి నడుమ ఒంటి స్తంభపు మేడ మీద || చందమామను చూచి వద్దామా సదానందా || శత్రులార్గురి చెంతచేరక ఇంద్రియాదుల వెంటబోక మట్టు తెలిసి మేలుకోట పట్టణంబున చేరి ఇపుడు || చందమామను చూచి వద్దామా సదానందా || చదువులన్నీ చదివిచదివీ చచ్చిపోయేదింతె గానీ గుట్టు తెలిపే గురుడు గల్గితే చూడవచ్చును సులభమున్నదీ || చందమామను చూచి వద్దామా సదానందా || అమర నారేయణ స్వామి ఆదిగురుని బోధచేత తలచినప్పుడె తనువులోన తప్పకుండా చూడవచ్చును || చందమామను జూచి వద్దామా సదానందా || అర్థాలు: చందమామ = అమర నారేయణ స్వామి దివ్య ప్రసన్న వదనం కావొచ్చు. (కామేశ్వర రావు గారు ఇది బిందుచక్రం కూడా కావొచ్చారు. కామెంటు చూడండి) సదానందా = నిత్యము ఆనందంలో ఉండేది/ఉండేవాడు. కవి తన మనసునే సంబోధిస్తూ ఉండవచ్చు. స్వామిని దర్శించుకుంటే కలిగే ఆనందం. బ్రహ్మానందం. తల్లడించే = బాధపెట్టే తామసులు = తమో గుణం కలవారు. అయితే ఇక్కడ ...