Saturday 19 November 2016

చిత్రం :  హార్ట్ ఎటాక్ (2014)
సంగీతం : అనూప్ రూబెన్స్
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : చైత్ర

సెలవనుకో మరి ఏడవకే మనసా
కలగనకే అది నిజమై పోదుకదా
ఈ దూరం ఏనాటికి చేరువవ్వునో
ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో
కన్నుల్లోని కన్నీటి కెరటాలలో ఓ ఓ
నేనేమైపోవాలి నిన్నేమనుకోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం ఓ ఓ
సెలవనుకో మరి ఏడవకే మనసా
కలగనకే అది నిజమై పోదుకదా

అనుకున్న అనుకున్న నాతోటే వుంటావనుకున్న
నాలాగే నీక్కూడా నేనంటే ఇష్టం అనుకున్న
పిలిచానా రమ్మని కసిరాన పొమ్మని
చివరికి ఈ ఆటలో అయిపోయా బొమ్మని
నువ్వు కాదంటే ఇక రానంటే
మన ఇద్దరి మధ్య ఇంకేం లేదంటే
నేనేమైపోవాలి నిన్నేమనుకోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం
సెలవనుకో మరి ఏడవకే మనసా

నువ్వంటే నాలాంటి ఇంకోనేనని అనుకున్నా
ఇన్నాళ్ళీ బ్రమలోనే ఆనందముగా బ్రతికానా
నచ్చిందే తడవుగా వేళ్ళోద్దే అలుసని
చెబుతున్నా మనసుకి వింటుందా మాటని
నా ఉహలని నా ఆశలని నరికేస్తున్నావు అని చిదిమేస్తే
నేనేమైపోవాలి నిన్నేమనుకోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం
సెలవనుకో మరి ఏడవకే మనసా

The otherwise dull and gloomy sky,
looks like a sea of blue.
The otherwise lonely twinkle stars
look like studded precious stones.
The depressing sound of the traffic
flows like music into my ears.
---
You and only you possess this
power of changing disgust into delight.
-----
Golden moments slip by
I cann't hold then back.
Don't ask me what and why
experession is what lack.
All that I can write to you
Is that I have a treasure.
The meetings with you- though few,
they were such a pleasure.
---
As I think of you, my friend
My pen moves uninterruptedly,
But there has to be a stop
and I stop - here
Every Girl wish at the time of taking her away from her family her Husband would say these words to her PAPA...!!!

Dear Father(in Law)...

I promise i will take care of your princess now she is my Queen My Life My Everything...!!!

I Will try my best to give her all happiness now she is my responsibility and my first priority...!!!

I Know she is still A Baby Doll for you..
And trust me Papa I will never hurt her feelings with any intention...!!!

You've been her mentor for all of these years there for her always through laughter and fears...!!!

Because of your caring she grew up to be, the love of my life a blessing to me...!!!

I Just want to tell you one thing Papa "you are not losing a daughter.. you are Gaining a son"...!!!
పెళ్ళిపుస్తకం సినిమా ఇప్పటికి ఎన్ని సార్లు చూసి ఉంటానో ఇంకా ముందు ముందు ఎన్నిసార్లు చూడబోతానో లెక్కేలేదు. నా టీనేజ్ చివరిదశలో చూశానేమో మనసులో అలా ముద్రించుకు పోయింది. బుడుగు తప్ప ముళ్ళపూడి వారి సాహిత్యం గురించి పెద్దగా పరిచయంలేని సమయంలో బాపురమణలిద్దరినీ దేవుళ్ళుగా ఆరాధించవచ్చు అని అనిపించిన సినిమా. ఇందులో ఇల్లు, పెరడు, ఆ మొక్కల మధ్య అరుగు నాకు ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను.

కొత్త దంపతులకి ఇవ్వగలిగిన అపురూపమైన బహుమతులలో ఒకటిగా శాశ్వతమైన స్థానాన్ని సంపాదించిన సినిమా. ఈ సినిమా విడుదలయ్యాక ఇందులోని "శ్రీరస్తూ శుభమస్తూ" అన్న పాట నేపధ్యంగా వాడని పెళ్ళి వీడియో ఆంధ్రాలో లేదనడం అతిశయోక్తి కాదు. ఇందులోని "సరికొత్త చీర" పాట దానికి ముందు సన్నివేశంలో హీరో పెళ్ళి గురించి చెప్పే మాటలు నాకు చాలా ఇష్టం. మీరూ ఆస్వాదించండి. 
"అమ్ముకుట్టీ.. నీకు కోపం వచ్చింది కన్నీళ్ళు కదిలాయ్.. నాకు గర్వంగా ఉంది, ఇంత గట్టి పెళ్ళాం దొరికినందుకు. ఇంత మంచి ఫ్రెండ్ ని కాదని నేను మరో పిల్లకేసి చూసినా... ఒకవేళ చూస్తే నవ్వితే షేక్ హ్యాండిస్తే.. అది నా ఉద్యోగ ధర్మం అని నీకు తెలియదా.. గుండెల్లో గూడు కట్టుకున్న ప్రేమనీ చీటికీ మాటికి పైకి చెప్పుకుంటామా.. 

అమ్ముకుట్టీ.. పెళ్ళంటే పాలల్లో పాలలా కలిసిపోవడం పంచదారలా కరిగిపోవడం పెళ్ళంటే నమ్మకం, ఆ నమ్మకం తిరుగులేనిది.. అదీ దీపం లాంటిది దానిమీద అనుమానపు నీడలు పడవు... అనుమానం ఉన్నచోట నారాయణ అన్నా బూతులా వినిపిస్తుంది నమ్మకం ఉన్న చోట బూతుకూడా నారాయణ అన్నట్లే వినిపిస్తుంది..."
--ముళ్ళపూడి వెంకట రమణ. 



చిత్రం : పెళ్ళిపుస్తకం (1991)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు

సరికొత్త చీర ఊహించినాను 
సరదాల సరిగంచు నేయించినాను
మనసూ మమత పడుగూ పేక 
చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత 
నా వన్నెలరాశికి సిరిజోత...
నా వన్నెలరాశికి సిరిజోత...


ముచ్చటగొలిపే మొగలిపొత్తుకు 
ముల్లూ వాసన ఒక అందం
అభిమానం గల ఆడపిల్లకు 
అలకా కులుకూ ఒక అందం
ఈ అందాలన్నీ కలబోశా... 
నీ కొంగుకు చెంగున ముడివేస్తా
ఈ అందాలన్నీ కలబోశా... 
నీ కొంగుకు చెంగున ముడివేస్తా

ఇది ఎన్నో కలల కలనేత 
నా వన్నెలరాశికి సిరిజోత...
నా వన్నెలరాశికి సిరిజోత

చురచుర చూపులూ ఒకమారు 
నీ చిరుచిరు నవ్వులూ ఒకమారు
మూతివిరుపులూ ఒకమారు 
నువు ముద్దుకు సిద్ధం ఒకమారు
నువు ఏ కళనున్నా మాబాగే 
ఈ చీర విశేషం అల్లాగే
నువు ఏ కళనున్నా మాబాగే 
ఈ చీర విశేషం అల్లాగే

సరికొత్త చీర ఊహించినాను 
సరదాల సరిగంచు నేయించినాను
మనసూ మమత పడుగూ పేక 
చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత 
నా వన్నెలరాశికి సిరిజోత...
హ...నా.. వన్నెలరాశికీ.. సిరిజో..త...
Most people come into your life temporarily simply to teach you something. They come and they go and they make a difference. And it’s okay that they’re not in your life anymore.

Not all relationships last, but the lessons these relationships bring to you do. If you learn to open your heart and mind, anyone, including the folks who eventually drive you crazy, can teach you something worthwhile.

Sometimes it will feel weird when you realize you spent so much time with someone you are no longer connected to, but that’s exactly how it’s supposed to be.

You are exactly where you’re supposed to be. We all are. When life takes something from us, it is only to create space for something new to enter in our life. If one looks back at all the failures, setbacks, and conflicts in life, we will see that all of it was required for us to be exactly where we are now.

Don’t let past relationships ruin your future. Don’t let someone or something that didn’t make it in your life continue to hurt you. If you do, you’re still giving a portion of your life to something that no longer exists – it’s like letting your happiness slip into a black hole. Learn the lesson, release the pain, and move on.

Scars remind us of where we have been, not where we are headed. Learn from your relationship lessons, and turn your wounds into wisdom.

Take your Life by the horns and Turn it around. Choose not to be a victim, but a WARRIOR.

Sunday 9 February 2014

నాని



ఇవాళ నేను ఒక స్నేహితుడి గురించి చెప్పుకుందాము అనుకుంటున్నాను. తన పేరు నాని. విన్నప్పుడు పేరు బాగుంది అనుకున్నా మరి మహేష్ బాబు అంటే ఇష్టం కదా!! కాని చూశాక ఏమీ నచ్చలేదు. కాని తన గురించి విన్నాక “మహేష్ బాబు కన్నా నువ్వే గ్రేట్ అనిపించింది నాని”. ఏం చెప్పాలి నాని నీ గురించి, ఇంత చిన్న వయసు లో నువ్వు  ఇల్లు బాద్యత,  చదువు నీకు ఏమి నేర్పింది మాలాంటి వాళ్లకి నేర్పనిది. ఇంత చదివినా పక్కవాడి కి సహాయం చెయ్యాలి అనే ఆలోచన రాని నేను నీ ముందు చదువు రాని మొద్దు ని. నిజమే నాకు అసలు ఆ ఆలోచనే రాదు. నాని చెప్పిన ఒక మాట ఈ రోజు ఈ కధ, కాదు కాదు తన కధ రాయడానికి నాకు ఆలోచన ఇచ్చింది.
రోజు నువ్వు సహాయం చెయ్యి రేపు నీకు అవసరము వచ్చినప్పుడు సహాయం నీకు సహాయం చేస్తుంది . సరిగా చెప్పానా నాని !!
చిన్న వయసు లో అమ్మ కి కట్టెలు కొట్టిపెట్టిన నీ చిన్న చేతులు ఏమి చెప్పాయి సహాయం చెయ్యడం నేర్చుకోమనా. స్కూల్ లో కొనుక్కోమని ఇచ్చిన రూపాయి దాచి అవి పది చేసి అమ్మ కి ఇచ్చిన నీకు దాచడం తప్ప నీకోసం కొనుక్కోవడం నేర్పలేదా నాని ???
పది కే చదువు ఆపేసిన నీకు, నీ చిన్ని భుజాలు బరువు మోయగలవా అని భయం వేయలేదా ??
తల్లిదండ్రులు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఇంకా ఏదో చెయ్యలేదు అనే పిల్లలకి ఏం చెప్పాలి నీ గురించి. చూసి నేర్చుకునేది కాదు చెప్తే వచ్చేది కాదు. మరి ఎలా నేర్చుకోవాలి అనుభవం నేర్పాలి అవును అనుభవమే నేర్పాలి. ఈ రోజు నాని ఒక Entrepreneur. తన సొంత పని, తనతో పాటు ఇంకో పది మందికి పని. తను తప్పకుండా జీవితం లో ఎదో ఒకటి సాధిస్తాడు. నాకు తెలుసు.