నాని



ఇవాళ నేను ఒక స్నేహితుడి గురించి చెప్పుకుందాము అనుకుంటున్నాను. తన పేరు నాని. విన్నప్పుడు పేరు బాగుంది అనుకున్నా మరి మహేష్ బాబు అంటే ఇష్టం కదా!! కాని చూశాక ఏమీ నచ్చలేదు. కాని తన గురించి విన్నాక “మహేష్ బాబు కన్నా నువ్వే గ్రేట్ అనిపించింది నాని”. 

ఏం చెప్పాలి నాని నీ గురించి, ఇంత చిన్న వయసు లో నువ్వు  ఇల్లు బాద్యత,  చదువు నీకు ఏమి నేర్పింది మాలాంటి వాళ్లకి నేర్పనిది. ఇంత చదివినా పక్కవాడి కి సహాయం చెయ్యాలి అనే ఆలోచన రాని నేను నీ ముందు చదువు రాని మొద్దు ని. నిజమే నాకు అసలు ఆ ఆలోచనే రాదు. నాని చెప్పిన ఒక మాట ఈ రోజు ఈ కధ, కాదు కాదు తన కధ రాయడానికి నాకు ఆలోచన ఇచ్చింది.
రోజు నువ్వు సహాయం చెయ్యి రేపు నీకు అవసరము వచ్చినప్పుడు సహాయం నీకు సహాయం చేస్తుంది . సరిగా చెప్పానా నాని !!
చిన్న వయసు లో అమ్మ కి కట్టెలు కొట్టిపెట్టిన నీ చిన్న చేతులు ఏమి చెప్పాయి సహాయం చెయ్యడం నేర్చుకోమనా. స్కూల్ లో కొనుక్కోమని ఇచ్చిన రూపాయి దాచి అవి పది చేసి అమ్మ కి ఇచ్చిన నీకు దాచడం తప్ప నీకోసం కొనుక్కోవడం నేర్పలేదా నాని ???
పది కే చదువు ఆపేసిన నీకు, నీ చిన్ని భుజాలు బరువు మోయగలవా అని భయం వేయలేదా ??
తల్లిదండ్రులు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఇంకా ఏదో చెయ్యలేదు అనే పిల్లలకి ఏం చెప్పాలి నీ గురించి. చూసి నేర్చుకునేది కాదు చెప్తే వచ్చేది కాదు. మరి ఎలా నేర్చుకోవాలి అనుభవం నేర్పాలి అవును అనుభవమే నేర్పాలి. ఈ రోజు నాని ఒక Entrepreneur. తన సొంత పని, తనతో పాటు ఇంకో పది మందికి పని. తను తప్పకుండా జీవితం లో ఎదో ఒకటి సాధిస్తాడు. నాకు తెలుసు.

Comments

Post a Comment

Popular posts from this blog