ఎదురు చూస్తున్నాను నేస్తం

నీ అందం...

ఏ గులాబి కి కొత్త రంగు తెస్తుందొ...

ఏ నక్షిత్రానికి కొత్త మెరుపు వస్తుందొ...

ఏ మబ్బుకి కొత్త నునుపు నిస్తుందొ...తెలియదు కాని...

నీ ముఖ సౌందర్యాన్ని కొరి...

చంద్రుడు మేఘముల మాటున సొమరిలా దాగుకొన్నాడు..

నీ తనువును స్పృశిస్తూ...నీ ముద్దు పెదవులు తాకుతూ...

జాలువారుతున్నఆ పరిమళాన్ని చూసి...

ఏదొ కొత్త పుష్పమను భ్రాంతితొ అనిలుడట్టే నీ చుట్టు తిరుగుచున్నాడు...

నీ సిగ్గులలొ ఎర్రబడిన వెన్నెలను చూసి...

సూర్యొదయ మయిందేమోనని పుడమి పులకరిస్తుంది...

నీవీ ప్రపంచము నిట్టు క్షొభ పెట్టుట న్యాయమా చెప్పు...!

నీవు వస్తావొ... రావొ...తెలియని...ఆలొచనల నడుమ..

ముఖంలొ నిండిన అరుణ కాంతిని ...సాయంత్రం తన పశ్చిమదిశలొ జారవిడుస్తూ...

నలుపు రంగుని నా ముఖాన్ని కప్పుతుంది...నాలొ కాంక్ష వెయ్యి కాగాడాలుగా వెలిగిస్తుంది....

నీవు లేక నిష్ఫలమైన నా జీవితంలొ....

విచారగ్రస్తమైన నా మదిగృహాంలొ నిండిన నీలిమని...

నీ నేత్ర కాంతులతొ చీల్చుతావనే ఆశతొ....ఆనంద ముద్రిత నేత్రాలతొ...

ఎదురుచుస్తున్నాను నేస్తం...!

Comments

Popular posts from this blog