గద్దలాడతాండాయి - బండి నారాయణస్వామి

 గద్దలాడతాండాయి 

- బండి నారాయణస్వామి 


రాయలసీమ లో కరువు అని వినడమే కానీ ఆ పరిస్థితులని గురించి చదివింది లేదు. 10 , 20 ఎకరాలు వున్నా రైతులు కూలి పనుల కోసం వెళ్లడం, నీటి కోసం సొంత అన్నదమ్ములే గొడవ పడటం చదువుతుంటే కరువు ఎంత పని అయినా చేయిస్తుంది అనిపిస్తుంది. అడుగుఅడుగునా పేదవాడి పై జరిగే దోపిడీ, దీనికి చిన్న పెద్ద తేడా లేదు. కరువు ఆకలి ఎంత పని అయినా చేయిస్తాయి. రచయిత ఎదో ఊహించి రాసినట్లు గా అనిపించలేదు అంతా అయన చూసినదే రాసారు అనిపించింది. ఫలానా పార్టీ ఫలానా వ్యక్తి అంటూ రచయిత దాక్కోలేదు, తెలుగు దేశం కాంగ్రెస్ అంటూ డైరెక్ట్ గానే రాసారు. ఏ పార్టీ వచ్చినా మధ్యలో దళారులు బాగుపడటం తప్ప పేదవారికి ఒరిగేది లేదు అని కుండ బాధలు కొట్టినట్టు చెప్పారు. హీరో లేని కథ, అలాగే ముగింపు కూడా లేని కథ. ఎందుకంటే ఈనాటికీ ఏ మారుమూల పల్లె చూసిన అదే పరిస్థితి వుంది.

ఇది ప్రజల్లో చైతన్యం వచ్చేదాకా మారదు.  మధ్యాహ్న భోజనం పధకం, 2 రూపాయలకే కిలో బియ్యం, నిజం గా అవసరం వున్నవారికి అందుతున్నాయా లేక మధ్యలో వాళ్ళకోసం ఇటువంటి పథకాలు పెట్టారా??


తన కులం వాళ్ళని , సొంత తమ్ముళ్ళని కూడా మోసం చేసిన నాగేంద్రప్ప అవకాశ వాదం శత్రువులు బైటవాళ్ళు కాదు మనతోనే వుంటారు అనిపిస్తుంది. పెద్ద మనుషులు గా చలామణి అయ్యే లింగయ్య, సుబ్బయ్య శెట్టి , శంకర రెడ్డి మనుషులు అంటేనే అసహ్యం తెప్పిస్తారు. 

Comments

Popular posts from this blog

విముక్త - వోల్గా .

Wings of Fire by Dr. A.P.J. Abdul Kalam

సాయంకాలమైంది గొల్లపూడి మారుతీ రావు