విముక్త - వోల్గా .

 విముక్త - వోల్గా .


విముక్త మొత్తం 5  కధలు. 5 గురి నుంచి. వారి వారి అనుభవాల నుంచి ఒకరు నేరుకున్న కధలు లేదా అనుభవాలతో తన భవిష్యత్తు ని చూసుకున్న కధలు. తమ జీవితాలలో ఎదో ఒక సమయం లో ఎదురుకున్న అనుభవాల నుంచి వారి ఆలోచన విధానాన్ని మార్చుకున్న తీరు చూసినపుడు సీత కి అది తప్పేమో అనిపించింది. కానీ అదే అనుభవం తనకు ఎదురు అయినపుడు ఆమె కి అర్థం అయింది వాళ్ళ మాటల్లో అంతరార్థం. 


ఆ 5 గురు - శుర్పనఖ, అహల్య, రేణుక, ఊర్మిళ మరియు రామ. 


రామాయణం లో పాత్రలైన వీళ్ళు, సీత ని కలిస్తే, ఆమె తో వారి అనుభవాలు పంచుకున్నపుడు సీత ఆలోచన విధానం ఎలా మారింది అనే ప్రయోగం చాల బాగుంది. 


నాకు బాగా నచ్చిన కధలు మృణ్మయనాదం అహల్య మరియు సైకత కుంభం రేణుక బాగా నచ్చారు. రామాయణం లో అగ్ని ప్రవేశం గురించి చదివినపుడల్లా ఎదో బాధ కలిగేది. ఎందుకు నిరూపించుకోవాలి అని. రాముని కోసం అని బాగా చెప్పారు వోల్గా.


 కానీ అదే కథ లో ఒకరి అధికారానికి లొంగకు, నీ మీద అధికారం ఒకరికి ఇవ్వకు అని చెప్పడం కూడా బాగుంది. సైకత కుంభం లో అది పాతివ్రత్యం కాదు ఏకాగ్రత అని చెప్పడం రేణుక మీద గౌరవాన్ని పెంచింది. 

లవకుశులని అప్పజెప్పి సీత ఎందుకు వెళ్లిపోయింది అని చిన్నపుడు అడిగితే బాధలు పడలేక అని చెప్పారు :) ఇపుడు తెలుస్తుంది ఆమె లో కలిగిన పరిణితి తో తానేంటో తెలుసుకుని వెళ్ళింది అని. 

తర్వాత ఆమె ఏం చేసింది అని అనుకోవడానికి నాకు shiva triology - secret of nagas బాగుంది. భలే కలిపేసుకున్న కదా. 


నాకు నచ్చిన కొన్న వాక్యాలు:

ఏది సత్యం ఎదో అసత్యం. అలాంటిది ఒకటి ఉందా. ఎవరి సత్యం వారిది. అలాంటి వారికి మరొకరి సత్యాసత్యాలను నిర్ణయించగల శక్తి ఉందా. నీ మనసుకు ఏది శాంతి ని ఇస్తుందో అదే సత్యం అనుకో. ఎందుకంటే సత్యం ఎపుడు ఒకేలా ఉండదు అది మారుతూ ఉంటుంది. 

నీకు తప్పు లేదు అనిపిస్తే విచారణ కి లొంగకు అధికారానికి తల వంచకు.

జ్ఞాన సంపాదనకు అనుభవాన్ని మించిన మార్గం లేదు.

నీపై అధికారాన్ని తీసుకో. పరులపై అధికారాన్ని వదులుకో. అపుడు నీకు నువ్వు చెందుతావు. నీకు నువ్వు దక్కుతావు. నీకు నువ్వు మిగులుతావు.


Comments

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. వ్యాసవాల్మీకుల కన్నా మనం తెలివైనవారం అన్న అతితెలివితో చేసే వికారపుభావనలనుండి ఇలాంటి వెర్రిమొర్రి కల్పనలే వస్తాయి. ఇతిహాసాలు పెద్దగ్రంథాలు కాబట్టి అందరూ అధ్యయనం చేయరు. చేయలేరు. ఈమేతావుల దృష్టి అంతా వాటిని అవహేశన చేయటం మీదే నాయె. కల్పన పేరిట అనుచితంగా వ్రాయకూడదు కదా - మూలకథకు కాని పాత్రల స్వరూపస్వభావాలకు కాని విఘాతంగా కల్పన ఉండరాదు కదా! ? కాని మన మేతావుల కల్పనాస్వాతంత్ర్యం వెనుక ఉన్న సనాతనధర్మధ్వేషం కారణంగా వారికి పట్టపగ్గాలు లేకుండా ఉన్నాయి. మూలకథను ఇచ్ఛిన ఋషులూ లేరు కాపీరైట్ గోలా లేదని ఎంత హీనమైన కల్పనలూ చేస్తున్నారు. వీళ్ళని శిక్షించేందుకు ప్రస్తుతం చట్టాలు సరిపోకపోతే - వీళ్ళకు భగవంతుడి నుండి శిక్ష ఉండకపోదు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Wings of Fire by Dr. A.P.J. Abdul Kalam

సాయంకాలమైంది గొల్లపూడి మారుతీ రావు