Posts

విముక్త - వోల్గా .

 విముక్త - వోల్గా . విముక్త మొత్తం 5  కధలు. 5 గురి నుంచి. వారి వారి అనుభవాల నుంచి ఒకరు నేరుకున్న కధలు లేదా అనుభవాలతో తన భవిష్యత్తు ని చూసుకున్న కధలు. తమ జీవితాలలో ఎదో ఒక సమయం లో ఎదురుకున్న అనుభవాల నుంచి వారి ఆలోచన విధానాన్ని మార్చుకున్న తీరు చూసినపుడు సీత కి అది తప్పేమో అనిపించింది. కానీ అదే అనుభవం తనకు ఎదురు అయినపుడు ఆమె కి అర్థం అయింది వాళ్ళ మాటల్లో అంతరార్థం.  ఆ 5 గురు - శుర్పనఖ, అహల్య, రేణుక, ఊర్మిళ మరియు రామ.  రామాయణం లో పాత్రలైన వీళ్ళు, సీత ని కలిస్తే, ఆమె తో వారి అనుభవాలు పంచుకున్నపుడు సీత ఆలోచన విధానం ఎలా మారింది అనే ప్రయోగం చాల బాగుంది.  నాకు బాగా నచ్చిన కధలు మృణ్మయనాదం అహల్య మరియు సైకత కుంభం రేణుక బాగా నచ్చారు. రామాయణం లో అగ్ని ప్రవేశం గురించి చదివినపుడల్లా ఎదో బాధ కలిగేది. ఎందుకు నిరూపించుకోవాలి అని. రాముని కోసం అని బాగా చెప్పారు వోల్గా.  కానీ అదే కథ లో ఒకరి అధికారానికి లొంగకు, నీ మీద అధికారం ఒకరికి ఇవ్వకు అని చెప్పడం కూడా బాగుంది. సైకత కుంభం లో అది పాతివ్రత్యం కాదు ఏకాగ్రత అని చెప్పడం రేణుక మీద గౌరవాన్ని పెంచింది.  లవకుశులని అప్పజెప్పి సీత ...

సాయంకాలమైంది గొల్లపూడి మారుతీ రావు

 సాయంకాలమైంది గొల్లపూడి మారుతీ రావు గారిని మూవీస్ లో విలన్ గా చూసిన తర్వాత "సంసారం ఒక చదరంగం" మూవీలో చూసి నేను ఆయన యాక్టింగ్ కి ఫ్యాన్ అయిపోయాను. కానీ ఇవాళ ఈ బుక్ చదివిన తర్వాత ఆయన లోని రచయితను చూసి ఆశ్చర్యపోయాను. పుస్తకాన్ని రివ్యూ చేసేంత గొప్పదాన్ని కాదు కానీ నాకు ఏం నచ్చిందో చెప్పాలి అనిపించింది. సుభద్రాచార్యులు గారు వైష్ణవ  సంప్రదాయంలో పుట్టి చివరిదాకా దాన్నే శ్వాసిస్తూ బతికిన ఆయన జీవితం అద్భుతం. దానిలో ఒడిదుడుకులు, సహధర్మ చారిణి వరదమ్మతో కలిసిన ఆయన పయనం గురించి బాగా రాశారు. చివరిదాకా ఆయన నమ్మిన దానిని ఆచరించడం చాలా గొప్పగా అనిపించింది. కొడుకు చదువు, అటు పై ఉద్యోగం అంటూ దూర దేశాలకు వెళ్లినా, కూతురు తనకు నచ్చిన వ్యక్తిని కులాంతర వివాహం చేసుకున్నా నిబ్బరంతో ఆయన నిలబడిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. పుస్తకం మొదలు పెట్టినప్పుడు మొదట్లో కొంచెం అర్థం కాలేదు కానీ 15 పేజీలు తర్వాత ఆపడం నావల్ల కాలేదు. వరదమ్మ గారితో కలిసి కృష్ణ భక్తి ని , సుభద్రాచార్యులు గారితో కలిసి పుత్రోత్సాహం అంతలోనే  ఎడబాటు, కూతురు పైన ప్రేమ ని వదులుకోలేక ఆమె వివాహాన్ని సమర్ధించలేక అయన పడిన వేదన అన్ని ఆయన ...

మీనా 1 & 2 - యద్దనపూడి సులోచనా రాణి.

 మీనా 1  & 2  - యద్దనపూడి సులోచనా రాణి. యద్దనపూడి సులోచనా రాణి గారి నవలలు చదివడం మొదలుపెట్టిన కొత్తలో ఈవిడ ఎందుకు హీరోయిన్స్ అంత హింసిస్తుంది అనిపించేది. ఏడుపు, గోల మొత్తం అయ్యాక ముక్కు తుడుచుకుని మొహం కడుక్కుని రంగం లోకి దిగుతుంది ఆవిడ హీరోయిన్. ఇదంతా చూసి ఆమ్మో అనిపించేది. కానీ కొన్నాళ్ల తర్వాత కొన్ని నవలలు చదివాకా అన్నీ ఒకసారి పక్కన పెట్టి చూసినపుడు అర్థం అయింది ఆవిడ నవలా నాయికలు  ప్రతి స్త్రీ జీవితం లో ఎదో ఒక సందర్భం లో ఎదుర్కునే కష్టం, ఇబ్బంది లేదా పరిస్థితి ని గురించి రాశారు. తన నవలా నాయిక ద్వారా ఒక situation ని ఎంత graceful  గా handle చెయ్యచో చెప్పారు. అందుకే ఆవిడ హీరోయిన్స్ ని నవలా నాయిక అన్నారు ఆమెను నవలా రాణి అని పిలుచుకున్నారు.  అలా ఆవిడ రచనల్లో నాకు నచ్చిన ఒకానొక నవల మీనా. ఇది 2 భాగాలుగా రాసారు.  ప్రతి తల్లి తండ్రి లాగానే తాను సాధించలేక పోయిన వాటిని తన కూతురు ద్వారా పొందాలి అనుకునే తల్లి కృష్ణవేణి. కానీ ఆ అతి ప్రేమ ని తట్టుకోలేక ఎలా అయినా తప్పించుకుని తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలి , తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి అనుకునే కూతురు మీనా....

ఋణం -గొల్లపూడి మారుతీరావు గారు

ఇది అబ్బు శాస్త్రి కథ. ఇతడు ఒక అమ్మాయి ని గురించి వెతుకుంటూ ఉంటాడు. తన వల్లే జరిగిన ఒక ప్రమాదం వల్ల ఆమె తల్లి తండ్రి చనిపోయారు అని భావిస్తూ ఉంటాడు. వేద శిక్షణను అందించడం మరియు దాని ఆదేశానుసారం జీవించడం తరతరాలుగా సంప్రదాయంలో భాగమైన బ్రాహ్మణ కుటుంబ జీవితాల ద్వారా రచయిత కథ నడిపించారు. కథ లో రామశాస్త్రి అనే పాత్ర, వేదం మరి దాని ఆచరణ యొక్క గొప్పదనాన్ని ఇప్పటి ఆధునిక జీవనానికి అన్వయిస్తూ చేసిన తర్కం ఆలోచింప చేస్తుంది.  సమాంతరంగా తప్పిపోయిన అమ్మాయి లీల కోసం అన్వేషణ కథ చాలా, కొన్నిసార్లు అనుకోని సంఘటనలతో సాగుతుంది. అనేక పాత్రలు అబ్బుశాస్త్రి ప్రయాణంలో చేరి అతనికి  సహాయపడతాయి. తనపై తనకు, తన దేవుడిపై మరియు ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించాలనే ఉద్దేశ్యంలో నిజాయితీతో అవ్యక్తమైన విశ్వాసం ఉన్న వేద పండితుడి కి ప్రకృతి ఎల్లప్పుడూ సహాయపడుతుంది అని రచయిత చెప్తూ వుంటారు.  చివరకు లీల ని కనుక్కుని ఆమె తల్లిదండ్రుల మరణానికి అసలు కారణం అయినా వ్యక్తి సహాయం తో ఆమె కి జీవితానికి ఒక దారిని కల్పిస్తాడు. రచయిత వేద సంప్రదాయాలు, వాటి పవిత్రత, వాటి పారాయణ ప్రభావాలు, వేద పాఠశాల జీవితం మొదలైన వాటి గురించి చాలా...

గద్దలాడతాండాయి - బండి నారాయణస్వామి

 గద్దలాడతాండాయి  - బండి నారాయణస్వామి  రాయలసీమ లో కరువు అని వినడమే కానీ ఆ పరిస్థితులని గురించి చదివింది లేదు. 10 , 20 ఎకరాలు వున్నా రైతులు కూలి పనుల కోసం వెళ్లడం, నీటి కోసం సొంత అన్నదమ్ములే గొడవ పడటం చదువుతుంటే కరువు ఎంత పని అయినా చేయిస్తుంది అనిపిస్తుంది. అడుగుఅడుగునా పేదవాడి పై జరిగే దోపిడీ, దీనికి చిన్న పెద్ద తేడా లేదు. కరువు ఆకలి ఎంత పని అయినా చేయిస్తాయి. రచయిత ఎదో ఊహించి రాసినట్లు గా అనిపించలేదు అంతా అయన చూసినదే రాసారు అనిపించింది. ఫలానా పార్టీ ఫలానా వ్యక్తి అంటూ రచయిత దాక్కోలేదు, తెలుగు దేశం కాంగ్రెస్ అంటూ డైరెక్ట్ గానే రాసారు. ఏ పార్టీ వచ్చినా మధ్యలో దళారులు బాగుపడటం తప్ప పేదవారికి ఒరిగేది లేదు అని కుండ బాధలు కొట్టినట్టు చెప్పారు. హీరో లేని కథ, అలాగే ముగింపు కూడా లేని కథ. ఎందుకంటే ఈనాటికీ ఏ మారుమూల పల్లె చూసిన అదే పరిస్థితి వుంది. ఇది ప్రజల్లో చైతన్యం వచ్చేదాకా మారదు.  మధ్యాహ్న భోజనం పధకం, 2 రూపాయలకే కిలో బియ్యం, నిజం గా అవసరం వున్నవారికి అందుతున్నాయా లేక మధ్యలో వాళ్ళకోసం ఇటువంటి పథకాలు పెట్టారా?? తన కులం వాళ్ళని , సొంత తమ్ముళ్ళని కూడా మోసం చేసిన నాగేంద్రప్ప అవ...

Roar - Cecelia Ahern.

 Roar  - Cecelia Ahern. "Roar" by Cecelia Ahern is a collection of thirty captivating short stories that explore the lives of women, their fears, and guilt. Each story features a unique and miraculous ability or quirk. Ahern's storytelling ability shines as she explores various aspects of female empowerment, resilience, and identity. The stories are imaginative and thought-provoking, offering a fresh perspective on the challenges women face in their day-to-day lives. With a blend of wit, charm, and a touch of magic, Ahern creates a mesmerizing narrative that celebrates the strength, vulnerability, and individuality of her characters. "Roar" is a delightful, feminist literary work that will resonate with readers of all backgrounds, leaving them inspired and uplifted. It's a must-read for both women and men seeking to understand women better. For anyone genuinely interested in comprehending their thoughts, fears, guilt, courage, resilience, energy, and deter...

పూనాచ్చి

 పూనాచ్చి.  - పెరుమాళ్ మురుగన్. ఇది అనిల్ బత్తుల గారి పోస్ట్ చూసి నేను చదివిన పెరుమాళ్ గారి రెండవ నవల.  ఒక వూరిలో ముసలివాడు, ముసలమ్మా ఒక చిన్న గుడిసె లో, కొన్ని మేకలు ఒక దూడని పెట్టుకుని బతుకుతూ ఉంటారు. కొండ మీద మేకల్ని మేపుకుంటున్న ముసలివాడికి, ఒక బాటసారి బుల్లి మేకపిల్లని ఇచ్చి వెళ్లిపోతాడు. అదే పూనాచ్చి. చిన్న పిల్లి పిల్లలా ఉన్న పూనాచ్చి ని ముసలమ్మ ప్రేమ గా పెంచుకుంటుంది. తోటి మేకలతో ఆటలు ఆడుతూ పూనాచ్చి పెరిగి పెద్దది అవుతుంది. ముసలమ్మ తో పాటు ఆమె కూతురు ఇంటికి వెళ్లిన పూనాచ్చి అక్కడ పూవన్ ని ప్రేమిస్తుంది. అవును మేకపిల్ల ప్రేమిస్తుంది. ఇక్కడిదాకా కథ చాల బాగుంది అందరి చిన్నతనం లా. ముసలమ్మ కూతురు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు పూవన్ ని వదిలి వెళ్లలేక పూనాచ్చి చాల ఏడుస్తుంది. ఇంతలో తోటి మేకపిల్ల ఉళుమ్బన్ మరణం, ఆ ఎడబాటు విషాదాన్ని మరిపిస్తుంది. 7 పిల్లలని ఒకేసారి కన్నపూనాచ్చి ఒక వింత గా ఆ వూరు లో అందరిని ఆకర్షిస్తుంది. కానీ బలహీనం గా ఉన్న ముసలమ్మ కి, పూనాచ్చి కి ఆ పిల్లలని పెంచడం చాల కష్టం అవుతుంది. కష్టానికి అలవాటు పడి పిల్లలతో ఆడుతున్న సమయం లోనే ఒక వ్యక్తి వచ్చి ఆ పిల్లల్ని ...