మీనా 1 & 2 - యద్దనపూడి సులోచనా రాణి.

 మీనా 1  & 2 

- యద్దనపూడి సులోచనా రాణి.


యద్దనపూడి సులోచనా రాణి గారి నవలలు చదివడం మొదలుపెట్టిన కొత్తలో ఈవిడ ఎందుకు హీరోయిన్స్ అంత హింసిస్తుంది అనిపించేది. ఏడుపు, గోల మొత్తం అయ్యాక ముక్కు తుడుచుకుని మొహం కడుక్కుని రంగం లోకి దిగుతుంది ఆవిడ హీరోయిన్. ఇదంతా చూసి ఆమ్మో అనిపించేది. కానీ కొన్నాళ్ల తర్వాత కొన్ని నవలలు చదివాకా అన్నీ ఒకసారి పక్కన పెట్టి చూసినపుడు అర్థం అయింది ఆవిడ నవలా నాయికలు  ప్రతి స్త్రీ జీవితం లో ఎదో ఒక సందర్భం లో ఎదుర్కునే కష్టం, ఇబ్బంది లేదా పరిస్థితి ని గురించి రాశారు. తన నవలా నాయిక ద్వారా ఒక situation ని ఎంత graceful  గా handle చెయ్యచో చెప్పారు. అందుకే ఆవిడ హీరోయిన్స్ ని నవలా నాయిక అన్నారు ఆమెను నవలా రాణి అని పిలుచుకున్నారు. 

అలా ఆవిడ రచనల్లో నాకు నచ్చిన ఒకానొక నవల మీనా. ఇది 2 భాగాలుగా రాసారు. 


ప్రతి తల్లి తండ్రి లాగానే తాను సాధించలేక పోయిన వాటిని తన కూతురు ద్వారా పొందాలి అనుకునే తల్లి కృష్ణవేణి. కానీ ఆ అతి ప్రేమ ని తట్టుకోలేక ఎలా అయినా తప్పించుకుని తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలి , తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి అనుకునే కూతురు మీనా. ఆ తల్లి, కూతురు మధ్యలో వారధి గా  వుంటూ నలిగిపోయే తండ్రి హనుమంతరావు. వీరి జీవితాల్లో జరిగిన సంఘటనలే మీనా .


ఒక తల్లి కూతురు ప్రేమ కథ.


ఇంకో కూతురు పుడితే మీనా మీద ప్రేమ తగ్గిపోతుందేమో అన్నంతగా ప్రేమించే కృష్ణవేణి, తన కూతురు భవిష్యత్తు ని గొప్పగా తీర్చిదిద్దాలి అనుకుంటుంది. కానీ అది తన కూతురు కి ఇష్టమా కాదా అని పట్టించుకోకపోవడం ఆమెని ఒక నిరంకుశురాలుగా మార్చి ఆ తల్లి కూతురు మధ్యలో దూరాన్ని పెంచుతుంది. తాను ఏమి చేసిన మీనా మంచి కోసమే అనుకునే ఆ ప్రయాణం లో మీనా ఇపుడు ఎదిగిన అమ్మాయి అని గుర్తించదు. 


తల్లి కట్టుబాట్లు, ఆమె అతి క్రమశిక్షణ దాటి స్వేచ్ఛగా ఎగరాలి అనుకునే మీనా, తల్లి కి తెలియకుండా నాన్న సహాయం తో పల్లెటూరు లో వున్న అత్త ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ ప్రేమలు, దండన లేని క్రమశిక్షణ చూసి ఆశ్చర్య పోతుంది. వాళ్ళతో కలిసిపోతుంది. ఒక కొత్త ప్రపంచాన్ని చూసినట్టుగా ఆనంద పడుతుంది. 


చదువు ఉండి కూడా తన తల్లి అండదండల తో ఎదగాలి అనుకునే సారధి కన్నా స్వయం కృషి తో ఎదుగుతున్న కృష్ణ పట్ల గౌరవం ఏర్పడుతుంది. తర్వాత ఆకర్షించబడుతుంది. తల్లి కి కృష్ణ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అని తెలిసి అయోమయానికి గురి అవుతుంది. సిటీ లో తల్లి గారాబం లో పెరిగిన కూడా తనదంటూ వ్యక్తిత్వం తో, అతిశయం లేకుండా అందరితో  కలిసిపోయిన మీనా అంటే కృష్ణ కి ఇష్టం కలుగుతుంది. 


మీనా, కృష్ణ ఇద్దరు చివరికి ఎలా కలుసుకున్నారు ...తల్లి కి మీనా ప్రేమ అర్థం అయిందా, మీనా కి తల్లి ప్రేమ తెలిసిందా అన్నదే నవల. 

Comments

Popular posts from this blog