ఋణం -గొల్లపూడి మారుతీరావు గారు



ఇది అబ్బు శాస్త్రి కథ. ఇతడు ఒక అమ్మాయి ని గురించి వెతుకుంటూ ఉంటాడు. తన వల్లే జరిగిన ఒక ప్రమాదం వల్ల ఆమె తల్లి తండ్రి చనిపోయారు అని భావిస్తూ ఉంటాడు. వేద శిక్షణను అందించడం మరియు దాని ఆదేశానుసారం జీవించడం తరతరాలుగా సంప్రదాయంలో భాగమైన బ్రాహ్మణ కుటుంబ జీవితాల ద్వారా రచయిత కథ నడిపించారు. కథ లో రామశాస్త్రి అనే పాత్ర, వేదం మరి దాని ఆచరణ యొక్క గొప్పదనాన్ని ఇప్పటి ఆధునిక జీవనానికి అన్వయిస్తూ చేసిన తర్కం ఆలోచింప చేస్తుంది. 

సమాంతరంగా తప్పిపోయిన అమ్మాయి లీల కోసం అన్వేషణ కథ చాలా, కొన్నిసార్లు అనుకోని సంఘటనలతో సాగుతుంది. అనేక పాత్రలు అబ్బుశాస్త్రి ప్రయాణంలో చేరి అతనికి  సహాయపడతాయి. తనపై తనకు, తన దేవుడిపై మరియు ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించాలనే ఉద్దేశ్యంలో నిజాయితీతో అవ్యక్తమైన విశ్వాసం ఉన్న వేద పండితుడి కి ప్రకృతి ఎల్లప్పుడూ సహాయపడుతుంది అని రచయిత చెప్తూ వుంటారు.

 చివరకు లీల ని కనుక్కుని ఆమె తల్లిదండ్రుల మరణానికి అసలు కారణం అయినా వ్యక్తి సహాయం తో ఆమె కి జీవితానికి ఒక దారిని కల్పిస్తాడు. రచయిత వేద సంప్రదాయాలు, వాటి పవిత్రత, వాటి పారాయణ ప్రభావాలు, వేద పాఠశాల జీవితం మొదలైన వాటి గురించి చాలా బాగా చెప్పారు. ఆయన ఊహించినట్లుగా, ఈ పుస్తకం మనల్ని ఆలోచింపజేస్తుంది. చదివిన వెంటనే మళ్ళీ రెండో సారి చదివిన నవల ఇది. 


కథ మా ఊరి దగ్గర ముక్కామల లో మొదలు అవడం వల్ల బాగా కనెక్ట్ అయ్యాను. మా వూరు ఘనాపాఠి తాతగారు, భాస్కర అవధాని గారు, కొవ్వూరు గోపాల శాస్త్రి గారు నాకు తెలుసు. వారిని గురించి రాసిన చివరి మాట ద్వారా తెలిసింది.

Comments

Popular posts from this blog