సాయంకాలమైంది గొల్లపూడి మారుతీ రావు

 సాయంకాలమైంది

గొల్లపూడి మారుతీ రావు గారిని మూవీస్ లో విలన్ గా చూసిన తర్వాత "సంసారం ఒక చదరంగం" మూవీలో చూసి నేను ఆయన యాక్టింగ్ కి ఫ్యాన్ అయిపోయాను. కానీ ఇవాళ ఈ బుక్ చదివిన తర్వాత ఆయన లోని రచయితను చూసి ఆశ్చర్యపోయాను.

పుస్తకాన్ని రివ్యూ చేసేంత గొప్పదాన్ని కాదు కానీ నాకు ఏం నచ్చిందో చెప్పాలి అనిపించింది.

సుభద్రాచార్యులు గారు వైష్ణవ  సంప్రదాయంలో పుట్టి చివరిదాకా దాన్నే శ్వాసిస్తూ బతికిన ఆయన జీవితం అద్భుతం.

దానిలో ఒడిదుడుకులు, సహధర్మ చారిణి వరదమ్మతో కలిసిన ఆయన పయనం గురించి బాగా రాశారు. చివరిదాకా ఆయన నమ్మిన దానిని ఆచరించడం చాలా గొప్పగా అనిపించింది.

కొడుకు చదువు, అటు పై ఉద్యోగం అంటూ దూర దేశాలకు వెళ్లినా, కూతురు తనకు నచ్చిన వ్యక్తిని కులాంతర వివాహం చేసుకున్నా నిబ్బరంతో ఆయన నిలబడిన తీరు నాకు చాలా బాగా నచ్చింది.

పుస్తకం మొదలు పెట్టినప్పుడు మొదట్లో కొంచెం అర్థం కాలేదు కానీ 15 పేజీలు తర్వాత ఆపడం నావల్ల కాలేదు.

వరదమ్మ గారితో కలిసి కృష్ణ భక్తి ని , సుభద్రాచార్యులు గారితో కలిసి పుత్రోత్సాహం అంతలోనే  ఎడబాటు, కూతురు పైన ప్రేమ ని వదులుకోలేక ఆమె వివాహాన్ని సమర్ధించలేక అయన పడిన వేదన అన్ని ఆయన తో కలిసి  అనుభవించాను.

వరదమ్మ  చనిపోయినప్పుడు ఆయన బాధకి నిజంగానే ఏడ్చాను.

చివరికి పుస్తకం మూసినప్పుడు అప్పుడే అయిపోయిందా అనిపించింది. 

ఆ ట్రాన్స్ నుండి వెనక్కి రావడానికి చాలా సమయం పట్టింది.

న్యూ ఇయర్ ని ఒక గొప్ప పుస్తకం తో మొదలుపెట్టడం చాలా సంతోషంగా ఉంది

నాకు ఇష్టమైన పుస్తకాలు లిస్టులో ఇది కూడా చేరింది మళ్లీ మళ్లీ చదవడానికి.

మరొక విషయం, ఇందులో ప్రస్తావించిన  పాశురాలు. వాటిని కూడా చదవాలి అనే కోరిక కలిగించింది.

థాంక్యూ మారుతి రావు గారు  for the master piece.

Comments

Popular posts from this blog